Reliance Industries: 2 లక్షల బారెల్స్ వెనిజులా చమురును కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

by S Gopi |

ఏప్రిల్ డెలివరీ కోసం ప్రముఖ ఇంధన సంస్థ వీటోల్ నుంచి దాదాపు 6-7 డాలర్ల తగ్గింపు ధరకు వెనిజులా ముడి చమురును కొనుగోళు చేసిందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.

Reliance Industries: 2 లక్షల బారెల్స్ వెనిజులా చమురును కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 లక్షల బారెళ్ల వెనిజులా చమురును కొనుగోలు చేసింది. దాదాపు ఏడాది విరామం తర్వాత వెనిజులా దేశం నుంచి రిలయన్స్ చేసిన మొదటి కొనుగోలు ఇది. ఏప్రిల్ డెలివరీ కోసం ప్రముఖ ఇంధన సంస్థ వీటోల్ నుంచి దాదాపు 6-7 డాలర్ల తగ్గింపు ధరకు వెనిజులా ముడి చమురును కొనుగోళు చేసిందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. గత నెలలో అధ్యక్షుడు నికోలస్‌ను అదుపులోకి తీసుకున్న అమెరికా, ట్రేడింగ్ సంస్థలైన వీటోల్, ట్రాఫిగ్యూరాకు లక్షల్ల బ్యారెళ్ల వెనిజులా చమురును మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి యూఎస్ లైసెన్స్‌లు మంజూరు చేసింది. వెనిజులా చమురు కొనుగోళ్లకు సంబంధించి మరో ప్రకటనలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. వాణిజ్య అవసరాలను బట్టి వెనిజులాతో సహా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలుకు భారత్ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. వెనిజులాతో సంబంధాల విషయంలో చాలా కాలంగా ఇంధన భాగస్వామ్యం ఉందని జైస్వాల్ పేర్కొన్నారు.

Next Story