Reliance: కీలక మైలురాయి అధిగమించిన రిలయన్స్

by S Gopi |

2025-26 ఆర్థిక సంవత్సరంలో 120 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయ మార్కును దాటిన తొలి భారతీయ కంపెనీగా కొత్త చరిత్ర సృష్టించింది.

Reliance: కీలక మైలురాయి అధిగమించిన రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 120 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయ మార్కును దాటిన తొలి భారతీయ కంపెనీగా కొత్త చరిత్ర సృష్టించింది. చమురు, టెలికాం, రిటైల్, డిజిటల్ సేవలు వంటి విభిన్న రంగాల్లో వ్యాపారం చేస్తున్న సంస్థ మొత్తం 124 బిలియన్ డాలర్ల(రూ. 11.9 లక్షల కోట్ల) ఆదాయాన్ని నమోదు చేసింది. 1966లో ఒక చిన్న టెక్స్‌టైల్ వ్యాపారంగా ప్రారంభమైన రిలయన్స్, ఇప్పుడు ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగిందని కంపెనీ పేర్కొంది. ఇదే కాకుండా, వార్షిక నికర లాభంలో 10 బిలియన్ డాలర్ల(రూ. 95.70 వేల కోట్ల) మార్కును దాటిన తొలి భారతీయ కంపెనీగానూ రిలయన్స్ నిలిచింది. మొత్తం వ్యాపారంలో రిలయన్స్ డిజిటల్ వ్యాపారం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. కొత్త సబ్‌స్క్రైబర్లు చేరడం, 5జీ సేవల విస్తరణ, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల పెరుగుదల కారణంగా ఈ విభాగం వార్షికంగా 18 శాతం పుంజుకుంది. రిటైల్ విభాగం 8 శాతం, ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Next Story