దేశవ్యాప్తంగా కాంపా కోలాను డిస్ట్రిబ్యూట్ చేయనున్న ఉడాన్!

by Disha Web Desk 17 |
దేశవ్యాప్తంగా కాంపా కోలాను డిస్ట్రిబ్యూట్ చేయనున్న ఉడాన్!
X

న్యూఢిల్లీ: ఇటీవల రిలయన్స్ విడుదల చేసిన 50 ఏళ్ల కిత్రం నాటి పాత బ్రాండ్ కాంపా కోలాను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టు బీ2బీ ఈ-కామర్స్ కంపెనీ ఉడాన్ గురువారం ప్రకటించింది. రిలయన్స్ కన్స్యూమర్‌లో భాగంగా కాంపా కోలాను మొదట్లో 50 వేల రిటైలర్, కిరాణా స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తామని, క్రమంగా రాబోయే రెండు నెలల్లో లక్ష రిటైలర్, కిరాణా స్టోర్లకు విస్తరించనున్నట్టు ఉడాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా కాంపా కోలాను అందించడం ద్వారా రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్) భాగస్వామ్యం అతిపెద్ద రిటైలర్ విభాగంలో ప్రత్యేక స్థానం కల్పించిందని ఉడాన్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ వినయ్ శ్రీవాస్తవ చెప్పారు. ఉడాన్ ప్లాట్‌ఫామ్‌లో కాంపా కోలా విస్తరణ, కొనుగోళ్లను పెంచే పనిని చేపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కాంపా కోలా బ్రాండ్‌ను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed