FMCG విభాగంలో కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చిన రిలయన్స్!

by Disha Web Desk 17 |
FMCG విభాగంలో కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చిన రిలయన్స్!
X

ముంబై: రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మరింత విస్తరించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో సబ్బులు, హైజీన్, లాండ్రీ, హోమ్‌కేర్ ఉత్పత్తులతో పాటు ప్యాకేజ్డ్ విభాగంలో కొత్త ప్రోడక్ట్స్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. దీని ద్వారా కంపెనీ ఇప్పటికే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్, రెకిట్ బెంకిసర్, పీఅండ్‌జీ కంపెనీలకు గట్టి పోటీనివ్వనుంది.

కంపెనీ కొత్తగా బ్యూటీ సోప్స్, నేచురల్, హైజీస్ సబ్బులు, డోజో డిష్‌వాష్ బార్‌లు, లిక్విడ్, హోమ్‌గార్డ్ టాయిలెట్, ఫ్లోర్ క్లీనర్‌లు, ఎంజో లాండ్రీ డిటర్జెంట్ పౌడర్, లిక్విడ్, బార్ ఉత్పత్తులను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు సరసమైన ధరలకే ఉత్పత్తులను అందిస్తామని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కిరాణా స్టోర్‌లతో పాటు అన్ని చోట్ల కంపెనీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది.


Next Story