Reliance: 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు కొన్న రిలయన్స్

by S Gopi |

నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్ఐఓసీ) నుంచి రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి

Reliance: 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు కొన్న రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి సుమారు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. ఇది చాలా పెద్ద పరిమాణం, గత కొన్నేళ్లలో ఇరాన్ నుంచి భారత్ చేసిన మొదటి కొనుగోలు ఇదే. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్ఐఓసీ) నుంచి రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను 30 రోజుల తాత్కాలిక సడలింపును ప్రకటించిన కొద్ది రోజులకే ఈ కొనుగోలు జరిగిందని వెల్లడించాయి. ఈ సడలింపు ప్రకారం, మార్చి 20కి ముందే నౌకల్లోకి ఎక్కించిన ఇరాన్ చమురును కంపెనీలు కొనుగోలు చేసి, ఏప్రిల్ 19 నాటికి దాని డెలివరీ చేయడానికి అనుమతి లభించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ చమురు అప్పటికే సముద్రంలో ఉంది. కొత్తగా ఎగుమతి చేసింది కాదు. తక్కువ సమయంలో రిలయన్స్ కంపెనీ చాలా వేగంగా స్పందించి, గ్లోబల్ బెంచ్‌మార్క్ ధర కంటే బ్యారెల్‌కు సుమారు 7 డాలర్లు ఎక్కువ చెల్లించింది. ఇది, ముడి చమురుకు ఉన్న అధిక డిమాండ్, పరిమితంగా ఉన్న లభ్యతను సూచిస్తుంది.

Next Story