అదానీ గ్రూప్‌‌‌ ఇష్యూపై రెగ్యులేటర్‌లు పర్యవేక్షిస్తున్నాయి: నిర్మలా సీతారామన్

by Disha Web Desk 17 |
అదానీ గ్రూప్‌‌‌ ఇష్యూపై రెగ్యులేటర్‌లు పర్యవేక్షిస్తున్నాయి: నిర్మలా సీతారామన్
X

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో జరుగుతున్న పరిణామాలను రెగ్యులేటర్‌లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవి స్వతంత్రంగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా సంబంధిత మార్కెట్లు నియంత్రించబడుతున్నాయని ఆమె ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను నియంత్రించడానికి, SEBI అధికారం కలిగి ఉంది. ఎవరి నియంత్రణ లేకుండా అది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.

అంతకుముందు సీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లు నియంత్రించబడ్డాయి. అదానీ గ్రూప్‌ పై వస్తున్న ఆరోపణలు పెట్టుబడిదారులు విశ్వాసాన్ని ప్రభావితం చేయదని అన్నారు. అలాగే, ఆర్‌బీఐ కూడా బ్యాంకింగ్ సిస్టం పటిష్ఠంగా ఉందని తెలిపింది. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీలు అదానీ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులకు ఎలాంటి ఢోకా లేదని అవి ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

Next Story

Most Viewed