- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nirmala Sitharaman: నిబంధనలు సాంకేతిక ఆవిష్కరణలను తుడిచిపెట్టకూడదు, ప్రోత్సహించాలి
కొత్త సాంకేతిక ఆవిష్కరణలను అణచివేయకుండా బాధ్యతాయుతంగా, ముఖ్యంగా ఏఐ విషయంలో ప్రోత్సాహకరమైన నిబంధనల అవసరం ఉందని అన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ కోసం ఏఐ; వేగవంతమైన ఆర్థికవృద్ధికి అవకాశం' నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి.. మన నిబంధనలు కొత్త సాంకేతిక ఆవిష్కరణలను అణచివేయకుండా బాధ్యతాయుతంగా ఉండాలని, ముఖ్యంగా ఏఐ విషయంలో ప్రోత్సాహకరమైన నిబంధనల అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఏఐ సాంకేతికతలను ఉపయోగించడమే కాకుండా వివిధ రంగాలలో వాటి అమలుపై సానుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో సాంకేతికతను తుడిచిపెట్టే నియంత్రణ మనకు అక్కర్లేదు. వేగంగా పురోగతి సాధిస్తున్న ఏఐకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. అందుకనుగుణంగా మార్పులు కావాలి, దానికి తగిన నిబంధనలు ఉండాలని తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీ ఉద్యోగాల విషయంలోనే కాదు, అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం, ఫలితంగా సమాజంపై కలిగే దుష్ప్రభావం గురించి ఆందోళన ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.






