Redmi TV Fire : రూ.27 వేలకే 43-అంగుళాల 4K స్మార్ట్‌టీవీ

by Disha Web Desk 17 |
Redmi TV Fire : రూ.27 వేలకే 43-అంగుళాల 4K స్మార్ట్‌టీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌టీవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.ప్రస్తుతం పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీలను తీసుకొస్తున్నాయి. తాజాగా Redmi కంపెనీ కూడా కొత్తగా 4K స్మార్ట్‌టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Redmi Smart Fire TV 4K’. ఇది 43-అంగుళాలు ఉంటుంది. దీని ధర రూ.26,999. కంపెనీ సైట్, అమెజాన్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. కంపెనీ ప్రత్యేకంగా స్మార్ట్ టీవీపై ఉచితంగా 1-సంవత్సరం పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది.


Redmi Smart Fire TV 4K స్మార్ట్ టీవీ 3,840 x 2,160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 4K బెజెల్-లెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది డాల్బీ ఆడియో, DTS:X టెక్నాలజీతో పాటు 24W స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. Fire OS 7లో రన్ అవుతుంది. Amazon Prime, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా, Zee5 వంటి మొదలగు యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో పేరెంట్ కంట్రోల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ ఫైర్ టీవీ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇది Mali G52 MC1 GPUతో పాటు క్వాడ్-కోర్ A55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, AV, 3.5mm ఆడియో జాక్‌లను కూడా కలిగి ఉంది.

Next Story

Most Viewed