- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme P4x 5G: రియల్ మీ అదిరిపోయే ఫోన్..7,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే
రియల్ మీ నుంచి పీ-సిరీస్ లో P4x 5G పేరుతో కొత్త ఫోన్ విడుదల చేసింది కంపెనీ

దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్లోకి మరో అదిరిపోయే ఫోన్ వచ్చింది. రియల్ మీ నుంచి పీ-సిరీస్ లో P4x 5G పేరుతో కొత్త ఫోన్ విడుదల చేసింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. 7000 mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ కొత్త ఫోన్ వస్తుంది. 6.72 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ కు ప్రధాన కెమెరా 50 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా కూడా రానుంది. 45 వాట్స్ వైర్డ్ చార్జర్ మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 సిస్టంపై పని చేయనుంది.
బైపాస్ చార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జీంగ్ సదుపాయాలు కూడా అందించనున్నారు. ఇందులో 6 జిబి+128 జీబీ మోడల్ ధర 15,499 రూపాయలుగా నిర్ణయించారు. 8 జీబీ + 125 జీబీ వేరియంట్ ధర 16,999 రూపాయలుగా ఉంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్ 17,999 రూపాయలకు అందిస్తున్నారు. ఈ ఫోన్ మూడు కలర్స్ లో లభిస్తోంది. ఎలిగంట్ పింకు, లేక్ గ్రీన్, మ్యాటిక్ సిల్వర్ కలర్స్ అందించనున్నారు. డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీ, ఫ్లిప్కార్ట్ లో సేల్స్ ప్రారంభం కానున్నాయి.






