బంపర్ ఆఫర్: రూ. 7,000 భారీ డిస్కౌంట్‌తో Realme GT NEO 3T స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
బంపర్ ఆఫర్: రూ. 7,000 భారీ డిస్కౌంట్‌తో Realme GT NEO 3T స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ Realme కొత్త మోడల్ 'GT Neo 3T' భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇంతకుముందు చైనాలో విడుదలైంది. ఇప్పుడు సెప్టెంబర్ 16న భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. లాంచ్ సందర్భంగా ఫోన్ భారీ తగ్గింపును పొందుతుంది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం లాంచ్ టైం లో ఫోన్ అసలు ధర కన్నా రూ. 7,000 తగ్గింపుతో రానుంది. స్మార్ట్ ఫోన్ చైనాలో దాదాపు రూ. 37,500 ప్రారంభ ధరతో విడుదల అయింది. ప్రస్తుతం భారత్‌లో ఇంకా తక్కువ ధరకు లభించనుంది.



Realme GT నియో 3T స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 870 SoC ద్వారా పనిచేస్తుంది. Realme UI 3.0తో Android 12 పై రన్ అవుతుంది. ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రత్యేకంగా 80W SuperDart ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌ చేస్తుంది. ఇది కేవలం 12 నిమిషాల్లో 50 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.



స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ సైడ్ 64MP+ 8MP+ 2MP కెమెరాలను కలిగి ఉంది. ముందు భాగంలో,16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ అవుతుంది.

Next Story

Most Viewed