RBL: ఆర్‌బీఎల్ బ్యాంకులో ఎల్ఐసీ బీమా పాలసీలు

by S Gopi |

ఎల్ఐసీకి చెందిన అన్ని రకాల జీవిత బీమా పాలసీలను పొందడానికి వీలు కల్పిస్తుందని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది.

RBL: ఆర్‌బీఎల్ బ్యాంకులో ఎల్ఐసీ బీమా పాలసీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)తో బ్యాంకస్సురెన్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకు మంగళవారం ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో ఆర్‌బీఎల్ బ్యాంకు కస్టమర్లు బ్యాంకు బ్రాంచ్‌లు, డిజిటల్ ఛానెళ్ల ద్వారా ఎల్ఐసీకి చెందిన అన్ని రకాల జీవిత బీమా పాలసీలను పొందడానికి వీలు కల్పిస్తుందని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆర్‌బీఎల్ బ్యాంక్ కస్టమర్లకు టర్మ్ ప్లాన్‌లు, ఎండోమెంట్ పాలసీలు, పెన్షన్, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. ఎల్ఐసీకి 3,600 కంటే ఎక్కువ బ్రాంచ్‌లు, కార్యాలయాలకు తోడు ఆర్‌బీఎల్ బ్యాంక్ 2,000 కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ బలం దేశవ్యాప్తంగా జీవిత బీమా విస్తరణ సులభతరం అవుతుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని బ్యాంకు పేర్కొంది.

Next Story