- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Loans: బ్యాంక్ లోన్ తీసుకున్నవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న EMI లు
Loans: బ్యాంక్ లోన్ తీసుకున్నవారికి ఆర్బిఐ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది.

దిశ, వెబ్ డెస్క్: Loans: బ్యాంక్ లోన్ తీసుకున్నవారికి ఆర్బిఐ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది. 2025 ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే తదుపరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బిఐ రెపోరేటును తగ్గించే ఛాన్స్ ఉంది. ఆరుగురు సభ్యుల బ్రుందం రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపోరేటు అంటే రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు. ఆర్బిఐ ఈ రేపోరేటును తగ్గించినప్పుడు బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకు ఇచ్చే లోన్స్ పై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. దీంతో కస్టమర్ల లోన్ ఈఎంఐల భారం తగ్గుతుంది.
ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంటే త్వరలో రెపోరేటు 6.25శాతం నుంచి 6శాతానికి తగ్గనుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ స్టాన్స్ ను న్యూట్రల్ నుంచి అకామడేటివ్ కి మార్చవచ్చు. భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీలకు లోన్స్ అందించే అవకాశం ఉంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కీలక సమయంలో జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్యే కొత్త టారిఫ్స్ ను ప్రకటించారు. ఇది ధరలను పెంచవచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలను రేకెత్తించవచ్చు. ఈ పరిణామాలన్నింటినీ ప్రపంచ వ్రుద్ధికి అవరోధాలుగా మారుతాయి. ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వ్రుద్ధికి సంబంధించి ఆర్బిఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆర్బిఐ ఇప్పుడే ద్రవ్యోల్బణ అంచనాలు మార్చే అవకాశం కనిపించడం లేదు. భారతదేశ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉంది. 2025 జనవరి, ఫిబ్రవరిలో సగటున 3.9శాతంగా ఉంది. జనవరి మార్చిలో ఆర్బిఐ అంచనా వేసిన 4.8శాతం కంటే ఇది చాలా తక్కువ. వృద్ధి రేటు కూడా మందగించింది. రూపాయి మునుపటిలా ఒత్తిడిలో లేదు. దీంతో ఆర్బిఐ రేట్లను తగ్గించడం కూడా మరింత సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రెపోరేటును 6శాతానికి తగ్గించడం వల్ల లోన్స్ తక్కువ వడ్డీలకు లభిస్తాయి. రెపోరేటుతో ముడిపడి ఉన్న హోం లేదా పర్సనల్ లోన్స్ ఈఎంఐ కొంచెం తగ్గుతుంది. ఫిబ్రవరిలో జరిగిన తగ్గింపులో కూడా బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి.






