- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: రూపాయి క్షీణతపై ఆందోళన వద్దు
భారత కరెన్సీ విలువ ఇప్పుడు 'అండర్‌వాల్యూ' కావొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. దీనర్థం వాస్తవంలో కంటే తక్కువకు ట్రేడ్ అవుతోందన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా బలహీనపడింది. ఓ దశలో 100 మార్కు కూడా చేరుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో భారత కరెన్సీ విలువ ఇప్పుడు 'అండర్‌వాల్యూ' కావొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. దీనర్థం వాస్తవంలో కంటే తక్కువకు ట్రేడ్ అవుతోందన్నారు. తాజాగా మింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో అస్థిరత పెరిగినా, రూపాయి మారకం స్థిరంగా ఉండేలా ఆర్‌బీఐ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం తర్వాత రూపాయి విలువ సుమారు 6 శాతం పడిపోయిందని, దీంతో ప్రస్తుతం రూపాయి నామమాత్రంగానే కాకుండా ఆర్ఈఈఆర్ (రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్) పరంగానూ తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతోందని పేర్కొన్నారు. అయితే కరెన్సీ విషయంలో ఎలాంటి నిర్దిష్ట మారకపు స్థాయిని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకోదని, కానీ ఊహాజనితంగా హెచ్చుతగ్గులకు లోనైతే జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఆయన వెల్లడించారు. రూపాయికి నిర్దిష్ట విలువను సెట్ చేయడం కంటే, కరెన్సీ మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికి ఆర్‌బీ ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.






