- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వ్యవహారంపై స్పందించిన ఆర్‌బీఐ
బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ వ్యవహారంపై, దాని చుట్టూ నెలకొన్న పరిణామాలను గమనిస్తున్నామని, ఇందులో ఎలాంటి వ్యవస్థాగత మోసం జరగలేదని మల్హోత్రా చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ బ్యాంకులో జరిగిన రూ. 590 కోట్ల భారీ మోసంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సోమవారం స్పందించారు. యూనియన్ బడ్జెట్ తర్వాత సాంప్రదాయంగా ఆర్థిక మంత్రితో జరిగే సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ వ్యవహారంపై, దాని చుట్టూ నెలకొన్న పరిణామాలను గమనిస్తున్నామని, ఇందులో ఎలాంటి వ్యవస్థాగత మోసం జరగలేదని మల్హోత్రా చెప్పారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో బ్యాంకు ఉద్యోగులు, ఇతరులు చేసిన రూ.590 కోట్ల మోసాన్ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఆదివారం బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్, బ్యాంకులోని లోపాలను సరిదిద్దడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎవరికీ ఈ మోసంలో ప్రమేయం లేదని, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. హర్యానా ప్రభుత్వం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తమ ఖాతాను బదిలీ చేయాలని కోరిన సమయంలో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న దానికి, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసం ద్వారా ఈ ఫ్రాడ్‌ను గుర్తించారు. చండీగఢ్‌లోని బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కలిసి ఈ మోసం చేసినట్టు తెలుస్తోంది.






