- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెల్లింపులు ఆపాలని మాస్టర్‌కార్డ్, వీసాలకు ఆర్‌బీఐ ఆదేశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై కఠిన ఆంక్షలు విధించిన అనంతరం తాజాగా చెల్లింపుల గేట్‌వే సంస్థలైన మాస్టర్‌కార్డ్, వీసాలపై కొరడా ఝుళిపించింది. కార్పొరేషన్‌లు, చిన్న సంస్థలు కార్డుల ద్వారా నిర్వహించే కమర్షియల్ చెల్లింపులను నిలిపివేయాలని ఇరు కంపెనీలను ఆదేశించింది. నిషేధం విధించిన విషయం గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కేవైసీ లేని వ్యాపారులకు మాస్టర్‌కార్డ్, వీసా కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు ఆర్‌బీఐ గుర్తించింది. సాధారణంగా వ్యాపార సంస్థలు ఆర్‌టీజీఎస్, నెట్ బ్యాంకింగ్, బల్క్ ట్రాన్స్‌ఫర్ విధానంలో చెల్లింపులు నిర్వహిస్తుంటాయి. కార్డుల ద్వారా చేసే ప్రక్రియను ఫిన్‌టెక్, కార్డు నెట్‌వర్క్‌లు మాత్రమే వినియోగిస్తాయి. కార్డ్ నెట్‌వర్క్ కంపెనీలు ఆమోదం లేకుండా పనిచేస్తున్నాయి.