- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: రికార్డు స్థాయిలో కేంద్రానికి ఆర్‌బీఐ డివిడెండ్
దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, రిస్క్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కేంద్రానికి భారీ డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఆర్‌బీఇ 616వ ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన విడుదల చేశారు. భారీ మిగులు నిధులను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, రిస్క్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దీంతో 2024-25లో ఆర్‌బీఐ రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వనుంది. అంతకుముందు 2023-25లో ప్రభుత్వానికి రూ. 2,68,590.07 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక లోటును 4.4 శాతం తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. ఈ చెల్లింపు క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 27.37 శాతం అధికం కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి రూ.2.56 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
ఇదే సమయంలో ఆర్‌బీఐ కంటిజెంట్ రిస్క్ బఫర్(సీఆర్‌బీ) లెవెల్‌ను కూడా 6.5 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. దీనివల్ల మొండి రుణాలు, ఆస్తి విలువ క్షీణించడం, సిబ్బంది ఖర్చులు, అనుకోకుండా ఆర్థిక సమస్య ఎదురైతే ఎక్కువ నిధులు అందుబాటులో ఉంటాయి. ఆర్‌బీఐ బోర్డు క్రమంగా సీఆర్‌బీని పెంచుతూనే ఉంది. కొవిద్-19 మహమ్మారి సమయంలో 5.5 శాతం వద్ద కొనసాగించిన తర్వాత 2022-23లో 6 శాతానికి, 2023-24లో 6.5 శాతానికి సవరించింది. ప్రతి ఏడాది ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై కమీషన్, ఛార్జెలు, విదేశీ మారకపు లాభాలు, అనుబంధ సంస్థల నుంచి ఆర్‌బీఐ ఆదాయం పొందుతుంది. కరెన్సీ ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీ చెల్లింపు, సిబ్బందిజీతాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులు, ఎమర్జెన్సీ ఫండ్ వంటి వాటికి కేటాయించాక మిగిలిన మొత్తాన్నే ప్రభుత్వానికి అందజేస్తుంది.






