- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: ఐదేళ్లలో తొలిసారిగా తగ్గిన ఆర్‌బీఐ ఉద్యోగుల సంఖ్య
ముఖ్యంగా క్లాస్-3, క్లాస్-4 విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా, ఉన్నత స్థాయి క్లాస్-1 అధికారుల సంఖ్య మాత్రం 7,325 నుంచి 7,517కు పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)లో ఉద్యోగుల సంఖ్య ఐదేళ్ల తర్వాత తొలిసారిగా తగ్గింది. తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2024 చివరినాటికి 13,520 మంది సిబ్బంది ఉండగా, 2025 చివరినాటికి 13,220కు పడిపోయింది. ముఖ్యంగా క్లాస్-3, క్లాస్-4 విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా, ఉన్నత స్థాయి క్లాస్-1 అధికారుల సంఖ్య మాత్రం 7,325 నుంచి 7,517కు పెరిగింది. మరోవైపు, కొత్త నియామకాలు కూడా గణనీయంగా తగ్గాయి. 2024లో 604 మంది కొత్తగా చేరగా, 2025లో కేవలం 247 మందిని మాత్రమే నియమించారు. ఇది ఆర్‌బీఐలో నియామకాల వేగం తగ్గిందనడానికి నిదర్శనం. అయితే సిబ్బంది సంఖ్య తగ్గినా, ఉద్యోగులపై అయ్యే వ్యయం మాత్రం పెరిగింది. పెన్షన్ రివిజన్, పదవీ విరమణ నిధులకు అధిక కేటాయింపుల కారణంగా ఆర్‌బీఐ ఉద్యోగుల వ్యయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం పెరిగి రూ. 10,136 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో సంస్థ కార్యకలాపాలను మరింత డిజిటలీకరణకు మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ‘ఈఆర్ఎం ఫ్రేమ్‌వర్క్ 2.0’ అమలు, ఆటోమేషన్ విస్తరణ, రిస్క్, ఆడిట్ వ్యవస్థల్లో ఆధునిక సాంకేతికత వినియోగం, అలాగే ‘ఉత్కర్ష్ 2029’ వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా ఆర్‌బీఐ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది.






