- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: ఈసారి రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత ఉండొచ్చు : మోర్గాన్ స్టాన్లీ
ఫలితంగా ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రెపో రేటు 5.25 శాతానికి దిగి వస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో జరగబోయే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ప్రముఖ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. కాబట్టి ఆర్‌బీఐ డిసెంబర్‌లో జరిగే సమావేశంలో కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రెపో రేటు 5.25 శాతానికి దిగి వస్తుంది. ఈ నిర్ణయం తర్వాత ఆర్‌బీఐ అప్రమత్త వైఖరిని అనుసరించవచ్చని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. తర్వాత మళ్లీ కీలక రేట్లలో కోత నిర్ణయంపై తొందరపడకపోవచ్చు. కానీ, తదుపరి చర్యలు తీసుకునే ముందు ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ద్రవ్యోల్బణ తీరును నిశితంగా పరిశీలిస్తుందని తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలని మోర్గాన్ స్టాన్లీ సూచించింది. క్రమంగా కేంద్రం తన రుణ భారాన్ని తగ్గించుకోవాలని, ఇదే సమయంలో పెద్ద ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు కూడా కొనసాగించడం అవసరమని పేర్కొంది. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధిని స్థిరంగా కొనసాగించవచ్చని వెల్లడించింది.






