Bank Holiday: ప్చ్.. ఆ పండుగ రోజు బ్యాంకులకు హాలిడే లేదు.. RBI కీలక ప్రకటన!

by Vennela |

Bank Holiday: ఆర్బిఐ (RBI) అన్ని బ్యాంకులను మార్చి 31, 2025 నాడు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

Bank Holiday: ప్చ్.. ఆ పండుగ రోజు బ్యాంకులకు హాలిడే లేదు.. RBI కీలక ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్: Bank Holiday: ఆర్బిఐ (RBI) అన్ని బ్యాంకులను మార్చి 31, 2025 నాడు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈద్ కారణంగా అనేక రాష్ట్రాల్లో సెలవులు ఉన్నప్పటికీ ..అన్ని ఏజెన్సీ బ్యాంకులు మార్చి 31న తెరిచి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ఈద్(Ramadan Eid) అంటే ఈద్ ఉల్ ఫితర్. మార్చి 31, 2025 సోమవారం నాడు రావడంతో హిమాచల్ ప్రదేశ్, మిజోరం, మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మార్చి 31న బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ మార్చి 31 ఆర్ధిక సంవత్సరం చివరిరోజు. అందుకే ప్రభుత్వ లావాదేవీలను కొనసాగించడానికి ఏజెన్సీ బ్యాంకులు తెరిచి ఉండాలని ఆర్బిఐ (RBI) ఆదేశించింది. మార్చి 31న ఈద్ నాడు బ్యాంకు(Bank Holiday) సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటుంది.

ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. దీని అర్థం ప్రభుత్వ ఆదాయం, చెల్లింపులు, పరిష్కారాలకు సంబంధించి అన్ని లావాదేవీలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం కొన్ని ఎంట్రీలు, చెల్లింపులు చేయాలి. కాబట్టి బ్యాంకులు ఆరోజు తెరిచి ఉంటాయి. దీని గురించి సాధారణ ప్రజలకు తెలియజేయాలని ఆర్బిఐ(RBI) ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది. మార్చి 31న ఈద్ రోజు బ్యాంకులు తెరిచి ఉండే వివరాలను అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటనలో పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరం కూడా ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులకు మార్చి 31 పనిదినంగా ఉంటుందని ఆర్బిఐ ప్రకటించింది. దీని అర్థం ఏజెన్సీ బ్యాంకులు ఆదివారాలు కూడా తెరిచే ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించేందుకు అన్ని బ్యాంకులు తెరిచి ఉండాలని ఆర్బిఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం , విదేశీ బ్యాంకులతో సహా అనేక బ్యాంకులు తన ఏజెన్సీ బ్యాంకులు(Agency banks)గా నియమించింది ఆర్బిఐ. ఈ సంస్థలు ఆర్బిఐ తరపున ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించేందుకు అధికారం కలిగి ఉంటాయి. మే 30, 2023 నాటికి ఆర్బిఐ ఏజెన్సీ బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆప్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు యాక్సెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. దీంతోపాటు డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ వంటి విదేశీ బ్యాంకులు కూడా ఇందులో పాల్గొంటాయి.

Next Story