- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI News: అలెర్ట్.. అలెర్ట్.. కొత్త 50 రూపాయల నోటుపై RBI కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: RBI News: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి కీలక ప్రకటన ఒకటి వచ్చింది. ఆర్బిఐ గవర్నర్(Rbi governor) సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) సంతకంతో కూడిన కొత్త రూ. 50 నోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ (RBI) బుధవారం వెల్లడించింది. దీంతో ఇప్పుడు చెలామణిలో ఉన్ను నోట్ల పరిస్థితి ఏంటో కూడా పేర్కొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రూ. 50నోటుకు సంబంధించి ఒక పెద్ద అప్ డేట్ ఇచ్చింది ఆర్బిఐ. త్వరలోనే మార్కెట్లోకి 50 రూపాయల నోటు కనిపించబోతోంది. నిజానికి గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) సంతకంతో కూడిన కొత్త 50 రూపాయల నోటును త్వరలోనే విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) బుధవారం తెలిపింది. శక్తికాంత దాస్(Shaktikanta Das) స్థానంలో మల్హోత్రా డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల డిజైన్ మహాత్మాగాంధీ సిరీస్ లోని రూ. 50 నోట్లను పోలి ఉంటుందని ఆర్బిఐ(RBI) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఎందుకంటే కొత్త నోటు సరే మరి పాత నోట్ల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ డీ మానిటైజేషన్(Demonetization) చేస్తారా అనే సందేహంలో వారున్నారు.
అయితే దీనిపై ఆర్బిఐ క్లారిటీ(RBI Clarity) ఇచ్చింది. ప్రజలు ఎవ్వరూ ఎలాంటి గందరగోళానికి గురికాకూడదని పేర్కొంది. ఎందుకంటే గతంలో జారీ చేసిన అన్ని రూ. 50 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)తెలిపింది. ప్రజలు ఎప్పటి మాదిరిగానే మీ పనులు చేసుకోవచ్చు. కొత్త నోట్లను మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలిపారు.