RBI: ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

by S Gopi |

రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఒక గంట ఆలస్య నిబంధనను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

RBI: ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ మోసాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలకు సంబంధించి అకౌంట్ నుంచి అకౌంట్‌కు బదిలీ చేసే అధిక మొత్తం లావాదేవీలను గంటసేపు నిలిపివేసేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించింది. 'డిజిటల్ చెల్లింపుల్లో భద్రతా చర్యల అన్వేషణ' చర్చా పత్రంలో ఆర్‌బీఐ ఈ మేరకు ప్రతిపాదనలు పేర్కొంది. ఇందుకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఒక గంట ఆలస్య నిబంధనను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సమయంలో, వినియోగదారులకు లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే, దాన్ని కొనసాగించడానికి ముందు బ్యాంక్ కస్టమర్ నుంచి రీ-కన్ఫర్మేషన్ తీసుకోవలసి ఉంటుంది. మర్చంట్ పేమెంట్స్, ఓటీటీ లేదా ఇతర సబ్‌స్క్రిప్షన్, లోన్, ఇన్సూరెన్స్ వంటి లావాదేవీలు, చెక్కులకు మినహాయింపు ఉంటుంది.

Next Story