- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన గవర్నర్ సంజయ్
ఆర్బీఐ వడ్డీరేట్లపై ఈ ఏడాదిలో ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి మాత్రం వడ్డీపేట్ల విషయంలో ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్బీఐ వడ్డీరేట్లపై (RBI Repo Rate) ఈ ఏడాదిలో ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి మాత్రం వడ్డీపేట్ల విషయంలో ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra).. వడ్డీరేట్లను 5.5 శాతంగానే ఉంచినట్లు తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినా.. అమెరికా భారత్ పై విధించే టారిఫ్ (America Tariff)లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో వడ్డీరేట్లను యథావిధంగానే ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.1 శాతానికి దిగి రావొచ్చని అంచనా వేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని కమిటీ అంచనా వేసింది. ఇక.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆ తర్వాత జూన్ నెలలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది.






