గుడ్‌న్యూస్.. చనిపోయినవారి బ్యాంక్ అకౌంట్ క్లెయిమ్స్ నిబంధనలను సవరించిన RBI

by Naga Rani Yarlagadda |

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.

గుడ్‌న్యూస్.. చనిపోయినవారి బ్యాంక్ అకౌంట్ క్లెయిమ్స్ నిబంధనలను సవరించిన RBI
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. మరణించిన వారి బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును నామినీలు క్లెయిమ్ చేసుకునేందుకు ఉన్న నిబంధనలను సవరించింది. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్లను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారాన్ని నామినీలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ 2025" కింద నిబంధనలను జారీ చేసింది. వీటిని 2026 మార్చి 31లోగా అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది.

నామినేషన్ లేదా సర్వైవర్ షిప్ క్లాజ్ తో ఓపెన్ చేసిన డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన డిపాజిటర్లు చనిపోతే.. ఆ డిపాజిట్లను నామినీలు లేదా సర్వైవర్ కు బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆర్‌బీఐ పేర్కొంది. నామినీ, సర్వైవర్ షిప్ క్లాజ్ లేని అకౌంట్ దారులు మరణిస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ కు సింప్లిఫైడ్ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలని తెలిపింది. సహకార బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లో రూ.5 లక్షలు, ఇతర బ్యాంకుల్లో రూ.15 లక్షలుగా సెటిల్మెంట్ పరిమితిని విధించింది. పరిమితికి మించిన నగదు ఉంటే.. వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టబద్ధమైన వారసత్వ ధృవపత్రాన్ని బ్యాంకులు కోరవచ్చని తెలిపింది. 15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయని నేపథ్యంలో బ్యాంకులు 4 శాతం వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని నామినీలకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లాకర్లు లేదా బ్యాంక్ కస్టడీలో ఉన్న వస్తువులు తిరిగి ఇవ్వడంలో ఆలస్యమైన ప్రతిరోజుకూ రూ.5000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకులకు తెలిపింది.

Next Story