- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News: గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లపై RBI కీలక ప్రకటన
2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనను (RBI Policy Review) విడుదల చేసింది. ఏప్రిల్ 6న ప్రారంభమైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం ముగిసింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే పాలసీ విధానం (Stance) కూడా స్థిరంగానే కొనసాగుతుందని వెల్లడించారు. అంటే వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై కూడా ఆర్‌బీఐ ఒక అంచనాకు వచ్చింది. ఈ ఏడాది భారత దేశం 6.9 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే నాలుగు త్రైమాసికాల్లో కూడా దేశ వృద్ధి రేటు 6.7 శాతం నుండి 7.2 శాతం మధ్యలో నిలకడగా కొనసాగుతుందని వివరించారు. మొదటి త్రైమాసికం (Q1): 6.8 శాతం, రెండవ త్రైమాసికం (Q2): 6.7 శాతం, మూడవ త్రైమాసికం (Q3): 7 శాతం, నాల్గవ త్రైమాసికం (Q4): 7.2 శాతం ఉంటుందని తెలిపారు.
ఎస్‌టీఎఫ్ రేటు 5 శాతంగా, అలాగే ఎంఎస్ఎఫ్ మరియు బ్యాంక్ రేట్లు 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంటాయని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల మధ్య ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో గొడవలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా చేసే హోర్ముజ్ జలసంధి దగ్గర సమస్యలు మొదలయ్యాయి. ఈ యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం రెండు వారాల పాటు యుద్ధానికి బ్రేక్ పడి కొంత ఊరట లభించినప్పటికీ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఆర్‌బీఐ ఆచితూచి అడుగులు వేస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.






