గుడ్‌న్యూస్..పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవల గడువు పొడిగింపు

by Dishanational1 |
గుడ్‌న్యూస్..పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవల గడువు పొడిగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవల గడువును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఉన్న గడువును మార్చి 15కి పొడిగించింది. కస్టమర్ డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లను ఈ ఏడాది మార్చి 15వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు వాడుతున్న వినియోగదారుల సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరికొత సమయం ఇవ్వాలని ఆర్‌బీఐ భావించింది. 'నిర్దేశించిన గడువులోగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నోడల్ ఖాతాల్లోని అన్ని పైప్‌లైన్ లావాదేవీల సెటిల్‌మెంట్లను పూర్తి చేయాలని సూచించింది. గడువు తర్వాత ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఉండదని' స్పష్టం చేసింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ద్వారా ఫ్రీజ్ చేసిన ఖాతాలు మినహా అన్నిటిలో బ్యాలెన్స్ విత్‌డ్రా ప్రక్రియను సులభతరం చేయాలని కంపెనీని ఆదేశించింది. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆటోమెటిక్ 'స్వీప్-ఇన్, స్వీప్ ఔట్' సదుపాయం కింద పార్ట్‌నర్ బ్యాంకులతో కస్టమర్లకు సజావుగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.


Next Story

Most Viewed