- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: ఆటో-డెబిట్ నిబంధనలను మార్చిన ఆర్‌బీఐ
దీనివల్ల కోట్లాది మందికి ప్రయోజనం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆటో-డెబిట్ చెల్లింపుల్లో కీలక మార్పులు చేసింది. దీనివల్ల కోట్లాది మందికి ప్రయోజనం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ముఖ్యంగా ఈఎంఐలు, సబ్‌స్క్రిప్సన్స్, బిల్లులు చెల్లించే విషయంలో నెలనెలా డెబిట్ విధానానికి ఈ రూల్స్ వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఒకసారి కస్టమర్ ఈ-మ్యాండేట్‌ను ఆమోదించిన తర్వాత, రూ. 15,000 వరకు ఉన్న నెలవారీ చెల్లింపులకు ప్రతి సారి ఓటీపీ అవసరం లేకుండా ప్రాసెస్ జరుగుతుంది. ఇది సబ్‌స్క్రిప్షన్‌లు, యుటిలిటీ బిల్లులు, చిన్న సిప్‌లు వంటి చెల్లింపులను మరింత సాఫీగా మారుస్తుంది.
ఇప్పటి వరకు ప్రతి ఆటో-డెబిట్ ట్రాన్సాక్షన్‌కు ఓటీపీ అవసరం ఉండటం వల్ల చాలా చెల్లింపులు ఫెయిల్ అయ్యేవి. ఓటీపీ ఆలస్యం, నెట్‌వర్క్ సమస్యలు లేదా వినియోగదారులు మర్చిపోవడం వల్ల సబ్‌స్క్రిప్షన్‌లు ఆగిపోవడం, క్రెడిట్ కార్డ్ లేట్ ఫీజులు వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త రూల్స్‌తో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా రెగ్యులర్ డిజిటల్ పేమెంట్‌లపై ఆధారపడే వినియోగదారులకు ఇది ఉపశమనంగా ఉంటుంది.
రూ. 1 లక్ష వరకు పరిమితి
అదే సమయంలో, బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ సిప్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల వంటి ముఖ్యమైన చెల్లింపులకు ఆర్‌బీఐ మరింత సడలింపు ఇచ్చింది. వీటికి రూ. 1 లక్ష వరకు పరిమితిని నిర్ణయించింది. అయితే, మొదటిసారి ఆటో-పే సెటప్ సమయంలో మాత్రం కస్టమర్ అనుమతి తప్పనిసరి అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రతి బ్యాంకు లేదా సంస్థ ఆటో డెబిట్‌కు కనీసం 24 గంటల ముందు అలర్ట్ మెసేజ్ ఇవ్వాలని ఆర్‌బీఐ తెలిపింది. సదరు అలర్ట్ మెసేజ్‌లో కంపెనీ పేరు, చెల్లింపు వివరాలు, తేదీ, ఇతర కీలక సమాచారం తప్పనిసరి ఉండాలి. దీనివల్ల యూజర్లు తమ ఖాతా నుంచి డబ్బు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.






