- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: 75 శాతం ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లే ఉండాలి: ఆర్‌బీఐ
by S Gopi |
ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేట్లకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కరెన్సీ నోట్లను అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా ఏటీఎంలలో రూ. 100 లేదా రూ. 200 నోట్లు నిరంతరం లభించేలా చూడాలని సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సర్క్యులర్ ప్రకారం, ప్రజలు తరచుగా ఉపయోగించే నోట్లు ప్రజలకు లభించాలని, అందులో భాగంగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేట్లను రూ. 100, రూ. 200 నోట్లకు క్రమం తప్పకుండా ఏటీఎం మిషన్‌లలో ఉండేలా చూడాలని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లు ఉండాలి. ఆ తర్వాత 2026, మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ నోట్లు ప్రజలకు లభించేలా చూసుకోవాలని తెలిపింది.
Next Story






