- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1.9 లక్షల కోట్ల లిక్విడిటీ
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం పదేళ్లలోనే అత్యంత తీవ్రమైన లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద ఎత్తున నిధులను జొప్పించేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం పదేళ్లలోనే అత్యంత తీవ్రమైన లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటోంది. నవంబర్‌లో రూ. 1.35 లక్షల కోట్ల మిగులు నుంచి డిసెంబర్‌లో రూ. 0.65 లక్షల కోట్ల లోటుకు మారింది. ఈ లోటు క్రమంగా పెరుగుతూనే ఉంది. జనవరిలో రూ.2.07 లక్షల కోట్లకు, ఫిబ్రవరిలో రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా, డాలర్-రూపాయి స్వాపింగ్ ద్వారా నెల రోజుల్లో రూ. 1.9 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురానుంది. గత నెలాఖరున 10 బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్-రూపాయి వేలం నిర్వహించిన తర్వాత లిక్విడిటెని మరింత పెంచేందుకు నిర్ణయించింది. దానికోసం ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల రూపంలో రూ. లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోళు చేస్తుంది. మార్చి 12, 18వ తేదీల్లో రెండు దశల్లో దీన్ని నిర్వహిస్తామని, అనంతరం మార్చి 24న మరో 10 బిలియన్ డాలర్ల డాలర్-రూపాయి వేలం చేపట్టనుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, నగదు లభ్యతపై సమీక్షణు నిర్వహించనున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.






