- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Motors: రతన్ టాటా ఫ్రెండ్ కు కీలక పదవి.. ఏం పొజిషన్ అంటే ?
Shantanu Naidu Tata Motors: టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్ పదవిని చేపట్టినట్లు శంతనునాయుడు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: Shantanu Naidu Tata Motors: టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్ పదవిని చేపట్టినట్లు శంతనునాయుడు తెలిపారు. ఈయన దివంగత వ్యాపారవేత్త రతన్ టాటాకు ప్రియమైన మిత్రుడనే సంగతి తెలిసిందే.
దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా ప్రియ మిత్రుడిగా గుర్తింపు మంచి తెచ్చుకున్న శంతను నాయుడు తాజాగా ఒక ప్రకటన చేశారు. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ లో ఆయన స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్ గా నియమితులైనట్లు తెలిపారు. టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్, హెడ్ స్ట్రాటజిక్ ఇనీషియేటివ్ గా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకుని ఇంటికి వచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురుచూసేవాడినని నాకు గుర్తు. ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్ లోకి వచ్చిందని లింక్డ్ ఇన్ లో శంతను నాయుడు పేర్కొన్నారు.
శంతను నాయుడు ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్. రోడ్డు మీద వేగంగా వెళ్లే వాహనాలతో శునకాలకు ప్రమాదం జరగకుండా ఆయన ఒక ఆవిష్కరణ చేశారు. వాటికోసం రేడియం కాలర్స్ ను తయారు చేశారు. ఈ విషయం శునకాలంటే అమితమైన ప్రేమ ఉన్న రతన్ టాటాకు తెలిసింది. టాటా ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడమే కాకుండా శాంతనుకు మార్గదర్శి బాస్ గా వ్యవహారించారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. 2018లో శంతను నాయుడు రతన్ టాటా సహాయకుడిగా పనిచేశారు. వ్యాపార దిగ్గజంతో ఆయన సన్నిహిత స్నేహం అందరి ద్రుష్టిని ఆకర్శించింది. టాటాకు జన్మదిన పాట పాడుతున్న నాయుడు వీడియో ఒకటి అప్పట్లో చాలా వైరల్ అయ్యింది.
శంతను నాయుడు 2014లో సవిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి 2016లో కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. తన పుస్తకం I came upon a lighthouseలో శంతను టాటా వ్యాపార వారసత్వం దాటి అసాధారణ స్నేహాన్ని, వ్యక్తిగత జీవితాన్ని హాస్యభరితమైన విధంగా వివరించారు. టాటాతో ముడిపడి ఉన్న చారిత్రక మైలురాళ్ల కంటే వారి సాహసాలు, వ్యక్తిత్వం, కనిపించని అంశాల గురించి రాయాలనుకుంటున్నట్లు నాయుడు తెలిపారు. అయితే ఒకే ఒక్క పుస్తకంలో ప్రతిదీ చెప్పడం కష్టమే అని అంగీకరించారు.
కాగా 2021లో శంతను నాయుడు ప్రారంభించిన గుడ్ ఫెలోస్ అనే సంస్థలో యాజమాన్యాన్ని రతన్ టాటా వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్రుద్ధులకు సహాయం చేస్తుంది. ఆయన తన వీలునామాలో నాయుడు విద్యకు చేసిన అప్పును కూడా మాఫీ చేశారు. 2024 అక్టోబర్ లో రతన్ టాటా మరణం తర్వాత శంతను నాయుడు భావోద్వేగ వీడ్కోలుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.






