- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా ర్యాపిడో, మ్యాజిక్ పిన్
జొమాటో, స్విగ్గీలకు పోటీగా మూడో అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్ గా మ్యాజిక్‌పిన్, రాపిడో సంస్థలు నిలవబోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : జొమాటో, స్విగ్గీలకు పోటీగా మూడో అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్ గా మ్యాజిక్‌పిన్, రాపిడో సంస్థలు నిలవబోతున్నాయి. మ్యాజిక్‌పిన్ తన రెస్టారంట్ నెట్‌వర్క్‌ను రాపిడో యాజమాన్యంలోని 'ఓన్‌లీ (Ownly)' ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం వెల్లడైంది. ఆగస్టులో ప్రారంభమైన ఓన్‌లీని ఇతర నగరాలకు విస్తరించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కొన్ని ప్రాంతాల్లో రాపిడో డెలివరీ ఫ్లీట్‌ను వినియోగించుకునే అవకాశం మ్యాజిక్‌పిన్‌కు లభిస్తుంది. నమ్మకమైన, చవకైన డెలివరీలు అందించడమే తమ లక్ష్యమని సంస్థలు పేర్కొన్నాయి.
అయితే మ్యాజిక్‌పిన్, రాపిడో కలిసి పనిచేయడం వలన కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ.. రైడర్ల పారితోషికాలు, డెలివరీ ఖర్చులు, కస్టమర్ ఆఫర్ల మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం, బ్రాండ్లు-రెస్టారంట్లతో సంబంధాలు, కస్టమర్ల నమ్మకం గెలుచుకోవడం వంటి సవాళ్లు ఉన్నాయని వ్యాపారరంగ నిపుణులు చెబుతున్నారు.






