- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Patanjali: పతంజలి సంస్థకు తప్పని చట్టపరమైన సవాళ్లు
నిధుల మళ్లింపు, కార్పొరేట్ వ్యవహారాల ఉల్లంఘనను పరిశీలిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు చట్టపరమైన సవాళ్లు తప్పట్లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్, తప్పుడు ప్రచారం చేసిన కారణంగా కేరళలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా సంస్థ నిర్వహించిన వరుస ఆర్థిక లావాదేవీలపై ఫెడరల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేశాయి. వాటి గురించి వివరణ ఇవ్వాలని తాజాగా పతంజలి సంస్థను కోరింది. దీనికి సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైత నోటీసులు జారీ చేసింది. నిధుల మళ్లింపు, కార్పొరేట్ వ్యవహారాల ఉల్లంఘనను పరిశీలిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పతంజలి సంస్థ నిర్వహించిన లావాదేవీలు అసాధారణమైనవి, సందేహాస్పదంగా ఉన్నాయి. ప్రస్తుతానికి దర్యాప్తు ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉన్న కారణంగా మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఏజెన్సీ నిరాకరించింది. ఇదే సమయంలో మంత్రిత్వ శాఖ నోటీసులపై స్పందించడానికి పతంజలి సంస్థకు దాదాపు 2 నెలల సమయం ఉన్నందున ఆలోపు పరిస్థితులు మారవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గతంలోనూ తప్పిదాలు
తాజా దర్యాప్తు పతంజలి ఆయుర్వేద సంస్థతో పాటు దాని అనుబంధ కంపెనీలకు చట్టపరమైన, నియంత్రణ సవాళ్ల సంఖ్య పెరిగాయి. గతేడాది పన్ను ఉల్లంఘనలు, తప్పుడు వాపసు క్లెయిమ్‌లపై కంపెనీ షో-కాజ్ నోటీసులను అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలపై హామీ ఇచ్చేలా ఉత్పత్తుల గురించి తప్పుదారి పట్టించే యాడ్స్ కారణంగా రాందేవ్ బాబాతో పాటు సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదే వ్యవహారంలో వివాదాస్పద ప్రకటనలను ప్రచురించినందుకు పలు వార్తాపత్రికలు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నాయి.






