- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC ఎండీగా రామకృష్ణన్ చందర్.. అమల్లోకి వచ్చిన నియామకం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో మేనేజింగ్ డైరెక్టర్‌గా రామకృష్ణన్ చందర్ నియమితులైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో మేనేజింగ్ డైరెక్టర్‌గా రామకృష్ణన్ చందర్ నియమితులైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30న ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) ఐదుగురు అభ్యర్థులతో చర్చలు జరిపి రామకృష్ణన్ చందర్‌ను సిఫారసు చేసింది. దీంతో అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ACC) ఆమోదం మేరకు ఆయన ఎల్‌ఐసీ ఎండీగా నియమితులయ్యారు. ఆ పదవిలో రామకృష్ణన్ చందర్ సెప్టెంబర్ 30, 2027 వరకు కొనసాగనున్నారు. అయితే, ఈ రోజు ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.
ఎల్ఐసీ వ్యూహాత్మక వృద్ధి, పెట్టుబడులు, కార్యాచరణను చందర్ సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉందని తోటి అధికారులు చెబుతున్నారు. 1990లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఎల్‌ఐసీలో చేరిన చందర్‌కు 35 సంవత్సరాల అనుభవం ఉంది. మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, అంతర్జాతీయ కార్యకలాపాలు, పెట్టుబడుల రంగాల్లో సీనియర్ డివిజనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, మార్కెటింగ్, పెన్షన్ స్కీమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇన్వెస్ట్‌మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జూన్ 2025లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO)గా రామకృష్ణన్ చందర్ నియమితులయ్యారు.






