- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zepto: ఐపీఓకు సిద్ధమైన క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో
జూలై 31లోపు మార్కెట్లో లిస్టింగ్ పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో త్వరలో స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు రూ. 11,000 కోట్ల నిధులను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఐపీఓ విజయవంతమైతే, ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో కూడా చేరనుంది. ఇటీవల పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ నుంచి అనుమతులు పొందింది. ఇప్పుడు అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (యూడీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసినట్టు సమాచారం. జూలై 31లోపు మార్కెట్లో లిస్టింగ్ పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్విక్ కామర్స్ రంగంలో జెప్టో వ్యూహం ఇతర కంపెనీలతో పోలిస్తే భిన్నంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తెలిపింది. ప్రస్తుతం జెప్టో 61 నగరాల్లో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో నగరంలో సగటున 21 స్టోర్ల సాంద్రత ఉండగా, పోటీ సంస్థలు కేవలం తొమ్మిదే నిర్వహిస్తున్నాయి. ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా స్థాపించిన ఈ కంపెనీ, తొలినాళ్లలో కిరాణాకార్ట్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. 45 నిమిషాల్లో డెలివరీ సేవలు అందించే కంపెనీగా మొదలై, అనంతరం సొంతంగా డార్క్ స్టోర్లు ఏర్పాటు చేసుకుని 10 నిమిషాల్లో డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే కస్టమర్లకు ఫాస్ట్ డెలివరీల లక్ష్యంతో జెప్టోగా మారింది.






