- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blinkit: కొత్త భారత్ యాత్ర ట్రావెల్ కార్డును విడుదల చేసిన క్విక్-కామర్స్ బ్లింక్ఇట్
ఇది రూపే ఆధారిత కార్డు, తక్షణం యూపీఐ టాప్-అప్ సౌకర్యంతో పనిచేస్తుంది. దేశంలో వివిధ నగరాల్లో మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణాలో కీలకంగా ఉంటుందని దిండ్సా వివరించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింక్ఇట్ కొత్త ట్రావెల్ కార్డును విడుదల చేసింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా భారత యాత్ర పేరుతో తెచ్చిన ఈ కార్డు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(ఎన్‌సీఎంసీ) ఆధారంగా పనిచేస్తుంది. బ్లింక్ఇట్ ఈ కార్డును ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లలో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ. 50 ఉంటుందని, ఎలాంటి కేవైసీ ప్రక్రియ అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో ఒక్కో సిటీలో ఒక్కో ట్రావెల్ కార్డుల అవసరాన్ని కూడా తొలగిస్తుందని బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న అల్బిందర్ దిండ్సా అన్నారు. ఇది రూపే ఆధారిత కార్డు, తక్షణం యూపీఐ టాప్-అప్ సౌకర్యంతో పనిచేస్తుంది. దేశంలో వివిధ నగరాల్లో మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణాలో కీలకంగా ఉంటుందని దిండ్సా వివరించారు. ఈ కార్డును భారత్ యాత్ర మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి లింక్ చేయడం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఐదేళ్ల కాలపరిమితితో వస్తుందని, వ్యాలెట్‌లో రూ. 2,000 వరకు యాడ్ చేసుకోవచ్చని బ్లింక్ఇట్ పేర్కొంది. ప్రస్తుత దీన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లోని మెట్రోలకు, ముంబై, చెన్నైలోని బస్సు ప్రయాణాలకు ఉపయోగించవచ్చు. భారత్ యాత్ర కార్డ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది.






