RBI: ఆర్‌బీఐ డివిడెండ్‌లో రాష్ట్రాలకూ వాటా

by S Gopi |   (  Updated:2026-05-24 16:22:40  IST  )

ఆర్‌బీఐ అందించే భారీ డివిడెండ్ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలతో కూడా పంచుకోవాలని ఆయన కోరారు.

RBI: ఆర్‌బీఐ డివిడెండ్‌లో రాష్ట్రాలకూ వాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ డివిడెండ్ ప్రకటించింది. అయితే, ఈ అంశం ఇప్పుడు దేశ ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కీలక డిమాండ్ కేంద్రం ముందు ఉంచారు. ఆర్‌బీఐ అందించే భారీ డివిడెండ్ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలతో కూడా పంచుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, సరఫరా అంతరాయాలు, ఖర్చుల ఒత్తిడి వంటి సమస్యలు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని, కాబట్టి ఈ అదనపు ఆదాయాన్ని 'సహకార సమాఖ్య' స్ఫూర్తితో రాష్ట్రాలకూ పంచాలని సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ద్రవ్య లోటును తగ్గించేందుకు ఆర్‌బీఐ రిజర్వులను అధికంగా వినియోగించడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో దేశ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. సంక్షోభ సమయంలో ఆర్‌బీఐ దేశానికి 'ఫైనాన్షియల్ షాక్ అబ్జార్బర్'లా పనిచేస్తుందని, అలాంటి సంస్థ వద్ద మెరుగైన రిజర్వులు ఉండటం అత్యవసరమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక అస్థిరత, కరెన్సీ ఒత్తిళ్లు పెరుగుతున్న ఈ సమయంలో ఆర్‌బీఐ స్వతంత్రత, ఆర్థిక సామర్థ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.

Next Story