- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSBs: ఐదేళ్లలో రూ. 5.82 లక్షల కోట్లకు పైగా రుణాలు రైటాఫ్ చేసిన పీఎస్‌బీలు
2020-21లో ఈ రుణాల రైటాఫ్ అత్యధికంగా రూ.1.33 లక్షల కోట్లు జరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.5.82 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటుకు తెలియజేసింది. 2024-25లో పీఎస్‌బీలు రూ.91,260 కోట్ల విలువైన రుణాల రైటాఫ్ చేశాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.15 లక్షల కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2020-21లో ఈ రుణాల రైటాఫ్ అత్యధికంగా రూ.1.33 లక్షల కోట్లు జరిగింది. ఆ తరువాతి సంవత్సరంలో రూ.1.16 లక్షల కోట్లు, 2022-23లో రూ.1.27 లక్షల కోట్లకు రైటాఫ్ చేయడం తగ్గింది. అలాగే, సమీక్షించిన గత ఐదేళ్లలో దాదాపు రూ.1.65 లక్షల కోట్లను పీఎస్‌బీలు రికవరీ చేశాయి. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేసిన ఎన్‌పీఏలను మాత్రమే బ్యాంకులు మాఫీ చేశాయని పంకజ్ చౌదరి అన్నారు. ఈ రైటాఫ్ అనేది రుణ గ్రహీతల బకాయిలను మాఫీ చేసినట్లు కాదు. సాంకేతికంగా అకౌంట్స్ నుంచి మాత్రమే తొలగించి, వాటికి కేటాయింపులు చేస్తాయి. రుణగ్రహీతలు బ్యాంకులకు ఈ బకాయిలు చెల్లించాల్సిందే. ఈ బకాయిలను రికవరీ చేసేందుకు అవసరమైన చర్యలను బ్యాంకులు కొనసాగిస్తాయని మంత్రి వివరించారు. రైటాఫ్ రుణాల రికవరీ నిరంతర ప్రక్రియ అని, బ్యాంకులు సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునళ్లలో దావా వేయడం, దివాలా కోడ్ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేయడం వంటి వివిధ రికవరీ యంత్రాంగం కింద రుణగ్రహీతల నుంచి రికవరీ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.






