PSBs: రూ. 49,456 కోట్ల లాభాలను నమోదు చేసిన పీఎస్‌బీలు

by S Gopi |

గతేడాది ఇదే సమయంలో 12 పీఎస్‌బీలు రూ. 45,547 కోట్ల లాభాలను ఆర్జించాయి.

PSBs: రూ. 49,456 కోట్ల లాభాలను నమోదు చేసిన పీఎస్‌బీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) రికార్డు స్థాయిలో లాభాలను సాధించాయి. మొత్తం 12 పీఎస్‌బీల్లో రెండు మాత్రమే క్షీణతను చూశాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రకారం, సమీక్షించిన త్రైమాసికంలో పీఎస్‌బీలు రూ. 49,456 కోట్ల లాభాలను నమోదు చేశాయి. ఇది గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో వెల్లడించిన లాభాల కంటే 9 శాతం ఎక్కువ. గతేడాది ఇదే సమయంలో 12 పీఎస్‌బీలు రూ. 45,547 కోట్ల లాభాలను ఆర్జించాయి. మొత్తం లాభాల్లో మార్కెట్ లీడర్ ఎస్‌బీఐ రూ. 20,160 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ. ఆ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అత్యధికంగా 58 శాతం వృద్ధితో రూ. 1,226 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 33 శాతం ఎక్కువగా రూ. 1,213 కోట్ల లాభాలను చూశాయి. మిగిలిన వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 23 శాతం చొప్పున లాభాల వృద్ధిని చూశాయి. కెనరా బ్యాంక్ 19 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 14 శాతం, ఇండియన్ బ్యాంక్ 12 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాతం, యూకో బ్యాంక్ 3 శాతం లాభాల వృద్ధిని చూశాయి. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా 8 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం లాభాల క్షీణతను చూశాయి.

Next Story