- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSBs: ఈ ఏడాది పీఎస్‌బీల లాభాలు రూ. 2 లక్షల కోట్లకు పైనే
బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తున్నాయి, డిపాజిట్లు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యం బలంగా ఉండటాన్ని సూచిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) రూ. 2 లక్షల కోట్లకు పైగా రికార్డు లాభాలను సాధిస్తాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగ ఆర్థికంగా బలపడుతోందని, స్థిరమైన లాభాలను చూస్తున్నాయని ఆయన తెలిపారు. పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తున్నాయి, డిపాజిట్లు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యం బలంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది పీఎస్‌బీలో క్రెడిట్ వృద్ధి దాదాపు 12 శాతం వద్ద ఉంది. ఇదే సమయంలో డిపాజిట్ల వృద్ధి దాదాపు 10 శాతం ఉందని నాగరాజు వివరించారు. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలు చారిత్రాత్మక లాభాలను చూడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే దాదాపు రూ. లక్ష కోట్లను చేరుకున్నాయి. మిగిలిన సగంలో రూ. 2 లక్షల కోట్లను దాటడం సులభమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లలో బ్యాంకింగ్ రంగం ఆదాయం భారీగా పెరిగింది. 2022-23లో పీఎస్‌బీలు రూ. లక్షల కోట్లకు పైగా లాభాలను చూశాయి. 2023-24లో రూ. 1.41 లక్షల కోట్లను, 2024-25లో రూ. 1.78 లక్షల కోట్ల లాభాలను నమోదు చేశాయని ఎం నాగరాజు పేర్కొన్నారు.






