- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bank Loans: ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ. 42,000 కోట్ల రుణాలను రైటాఫ్ చేసిన పీఎస్‌బీలు
బ్యాంకులు వివిధ రికవరీ మెకానిజమ్‌ల ద్వారా సంబంధిత ఖాతాదారుల నుంచి రికవరీ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.42,000 కోట్ల రుణాలను మాఫీ చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. 2024-25 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ. 8,312 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 8,061 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 6,344 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 5,925 కోట్లు) విలువైన రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ రైటాఫ్ ద్వారా రుణాలు రద్దు కావని, రుణాలు తీసుకున్నవారు బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని, వారి నుంచి నిధులు వసూలు చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. బ్యాంకులు వివిధ రికవరీ మెకానిజమ్‌ల ద్వారా సంబంధిత ఖాతాదారుల నుంచి రికవరీ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. సమీక్షించిన కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాలు మొత్తం రూ. 42,035 కోట్లు కాగా, రూ. 37,253 కోట్ల రికవరీ జరిగింది. గత 2023-24లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 1.14 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు.






