భారత వృద్ధికి ప్రైవేట్ వినియోగం మద్దతు: ఆర్‌బీఐ నివేదిక!

by Dishafeatures2 |
భారత వృద్ధికి ప్రైవేట్ వినియోగం మద్దతు: ఆర్‌బీఐ నివేదిక!
X

ముంబై: ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధికి ప్రైవేట్ వినియోగం కీలక మద్దతుగా నిలవనుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెలిపింది. సోమవారం విడుదలైన తాజా నెలవారీ నివేదికలో గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ కావడం, తయారీ పుంజుకోవడం ద్వారా వృద్ధి పుంజుకోనుందని ఆర్‌బీఐ పేర్కొంది. వృద్ధి నెమ్మదించడంతో పాటు అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ బలహీనపడిందని, బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిర పరిస్థితులున్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. 2022-

Private consumption, rural demand to drive India's growth in Apr-Jun quarter, highlights RBI bulletin23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉనాయి. 2021, నవంబర్ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యం కంటే దిగువకు చేరుకుంది. ముఖ్యంగా ప్రైవేట్ వినియోగం క్రమంగా ఊపందుకోవడం వృద్ధికి సానుకూలంగా ఉందని 'స్టేట్ ఆఫ్ ది ఎకానమీ' పేరున విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. మార్చి త్రైమాసికానికి సంబంధించి కార్పొరెట్ ఫలితాలు బాగున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు గణనీయమైన పనితీరును నమోదు చేస్తున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Also Read..

రూ. 1,200 కోట్ల అప్పులు చెల్లించనున్న అనిల్ అంబానీ!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed