Economy: ప్రైవేట్ కంపెనీలు దేశ వృద్ధికి పెట్టుబడులు పెట్టాలి: పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్

by S Gopi |

ప్రైవేట్ రంగం ప్రస్తుతం ఎక్కువ మూలధన నిధులను దేశాభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి.

Economy: ప్రైవేట్ కంపెనీలు దేశ వృద్ధికి పెట్టుబడులు పెట్టాలి: పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ కంపెనీలు తమ మూలధన నిధులతో దేశ వృద్ధి పథానికి దోహదపడాలని, విస్తృతంగా పెట్టుబడులు, ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి చోదకాలుగా ఉండాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) ఛైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ అన్నారు. ఆదివారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఉపాధి కల్పించడం ఇప్పటికీ ఆందోళన కలిగించే ముఖ్యమైన అంశంగా ఉంది. అందుకే ప్రభుత్వం సంఘటిత రంగంలో ఎక్కువ ఉద్యోగాలు లభించేలా చేయడంపై దృష్టి సారిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతులు దేశ వృద్ధిని ముందుకు నడిపిస్తాయి. ఈ క్రమంలో ప్రైవేట్ రంగం ప్రస్తుతం ఎక్కువ మూలధన నిధులను కలిగి ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశాభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి. యువ శ్రామిక శక్తి, డిజిటల్ టెక్నాలజీలో పురోగమిస్తున్న దేశ సామర్థ్యాన్ని గుర్తించాలి. వికసిత్ భారత్ లక్ష్యంతో సమిష్టి వృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు వీలవుతుంది. బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, సున్నా ఉద్గారాలను చేరే మార్గాన్ని అనుసరించాలి.

Next Story