- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OYO: ఓయో ఐపీఓకి సెబీ గ్రీన్ సిగ్నల్
మార్కెట్ ద్వారా దాదాపు రూ. 6,500 కోట్ల నిధులు సేకరించాలనే ఈ కంపెనీ ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ 'ఓయో' మాతృసంస్థ అయిన ప్రిజం, షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్ ద్వారా దాదాపు రూ. 6,500 కోట్ల నిధులు సేకరించాలనే ఈ కంపెనీ ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఓ ద్వారా మార్కెట్లో కంపెనీ మొత్తం విలువ సుమారు రూ. 58 వేల కోట్ల నుండి రూ. 66 వేల కోట్ల (7-8 బిలియన్ డాలర్లు) మధ్య ఉండాలని సంస్థ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పబ్లిక్ అప్‌డేటెడ్ ముసాయిదా పత్రాలను త్వరలో సెబీకి సమర్పించనుంది. నిజానికి ఓయో సంస్థ 2021లోనే షేర్ మార్కెట్లోకి రావాలని ప్రయత్నించినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకుల వల్ల అప్పట్లో ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఈసారి పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా పటిష్టమైన వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే సెబీ మాజీ ఛైర్మన్ అజయ్ త్యాగిని తమ బోర్డులోకి తీసుకుంది. ప్రముఖ సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ సంస్థ.. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, యూరప్ దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడం, అలాగే ప్రీమియం హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మార్కెట్లో మంచి లాభాలను సాధించాలని చూస్తోంది.






