Postal Department: పోస్టల్ శాఖాలోనూ 24 గంటల డెలివరీ

by S Gopi |

ప్రస్తుతానికి ఈ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు

Postal Department: పోస్టల్ శాఖాలోనూ 24 గంటల డెలివరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ తపాలా శాఖ తన సేవల్లో కీలక సంస్కరణలను చేపట్టింది. అత్యవసర, సమయానికి చేరాల్సిన సరుకుల కోసం 24, 48 గంటల డెలివరీ హామీలతో మూడు ప్రీమియం సేవలను మంగళవారం తీసుకొచ్చింది. 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్, 48 స్పీడ్ పోస్ట్ వంటి సేవలను కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా అన్ని పార్శిళ్లను 24 గంటలు లేదా 48 గంటల వ్యవధిలో అందించే లక్ష్యంతో ఈ సేవలను తీసుకొచ్చారు. ఈ తరహా సేవల ద్వారా ఇండియా పోస్ట్‌ పునరుజ్జీవం సాధించిన ఘట్టమని సింధియా అభిప్రాయపడ్డారు. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ కొత్త సేవల్లో ఓటీపీ-వెరిఫైడ్ డెలివరీలు, సమగ్ర ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్‌తో పాటు రియల్-టైమ్ ఎస్సెమ్మెస్ అలర్ట్స్‌తో జరుగుతాయి. వ్యాపారులకు సంబంధించి 'బుక్ నౌ పే లేటర్ ' సదుపాయం కూడా ఉంటుందని, బల్క్ బుకింగ్‌లకు ఉచిత పిక్-అప్, జియో ట్యాగింగ్, సెట్రలైజ్డ్ బిల్లింగ్ లాంటి సేవలు ఉన్నాయని ఇండియా పోస్ట్ పేర్కొంది.

Next Story