అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న పోస్టాఫీసు SCSS స్కీం

by Disha Web Desk 17 |
అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న పోస్టాఫీసు SCSS స్కీం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో దేశీయ దిగ్గజ బ్యాంకులు వరుసగా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఆర్‌బిఐ రేపో రేటు పెంచడం వలన బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే బ్యాంకులు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు కూడా వినియోగదారులకు ఎక్కువ వడ్డీని అందిస్తుంది. ఇతర ఆర్థిక సంస్థల కంటే అధికంగా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఈ స్కీం పేరు 'పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)'. దీని కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వినియోగదారులు 7.4% అధిక వడ్డీ రేటును పొందవచ్చు. ఈ వడ్డీ రేటును ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసు తీసుకొచ్చింది.

పోస్టాఫీసు పథకాలు సాధారణంగా ఎక్కువ వడ్డీని అందిస్తుంటాయి. అలాంటిది 60 సంవత్సరాలు పైబడిన వారికి, వారు పొదుపుపై ఇంకా ఎక్కువ వడ్డీని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. 60 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ స్కీం లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో భార్య/భర్తలు ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. మొత్తం పెట్టుబడి 15 లక్షల పరిమితిని దాటకూడదు. ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ. 1000.

7.4 వడ్డీ రేటు ప్రకారం SCSS పథకంలో ఒకేసారి రూ. 10 లక్షల మొత్తాన్ని FD చేస్తే 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ.14,29,000 వస్తాయి. వడ్డీగా రూ. 4,29,000 లభిస్తాయి. వడ్డీ మూడు నెలలకు ఒకసారి సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. రూ. లక్ష పెట్టుబడిపై నెలకు రూ. 610 పైన వడ్డీ వస్తుంది. దీనిని మూడు నెలల ప్రాతిపదికన రూ. 1830 పైన వడ్డీని అకౌంట్‌లో జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15H ఫారం ఇవ్వడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 80C కింద మినహాయింపులను పొందవచ్చు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, 60 సంవత్సరాలు పై బడిన వారు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి : Post Office: యాప్ ద్వారా పోస్టాఫీసు డిజిటల్ ఖాతాను ఇలా ఓపెన్ చేయండి


Next Story

Most Viewed