- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PNB: రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఐదేళ్ల తర్వాత కీలక రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ వడ్డీ రేట్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కూడా రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. సవరించిన రేట్లు గృహ, వాహన, విద్య, వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల రుణాలకు వర్తిస్తాయని, ఫిబ్రవరి 10 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు నిర్ణయంతో ఇళ్ల రుణాలపై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫలితంగా బ్యాంకు అందించే రూ. లక్ష రుణంపై ఈఎంఐ రూ. 744 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, 2025 మార్చి 31, వరకు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలపై పూర్తి మినహాయింపు ద్వారా కస్టమర్‌లు ప్రయోజనం పొందవచ్చని పీన్‌బీ పేర్కొంది. వాహన రుణాలపై వడ్డీ రేటు 8.50 శాతం నుంచి, విద్యా రుణాలపై 7.85 శాతం నుంచి, పర్సనల్ లోన్‌లపై 11.25 శాతం నుంచి వడ్డీ వర్తించనుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. తద్వారా బ్యాంకులు అందించే రిటైల్ రుణాలపై ప్రభావం చూపే వడ్డీ రేట్లలోనూ మార్పులు రానున్నాయి.






