PNB: పీఎంస్వనిధి పథకాన్ని డిజిటల్ రూపంలో పొందే ఛాన్స్: పీఎన్‌బీ

by S Gopi |

దీనికోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్, ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామని..

PNB: పీఎంస్వనిధి పథకాన్ని డిజిటల్ రూపంలో పొందే ఛాన్స్: పీఎన్‌బీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. పీఎం స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి(పీఎంస్వనిధి), ఇతర బ్యాంకు సౌకర్యాల కోసం డిజిటల్ పరిష్కారాలను ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్, ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీనివల్ల వీధి వ్యాపారులు భౌతికంగా బ్యాంకు బ్రాంచుల నుంచి మాత్రమే కాకుండా ఇకపై డిజిటల్ మార్గాల ద్వారా ఈ పథకాన్ని మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చని వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు సులభంగా నిధులు లభించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే పీఎంస్వనిధి. బ్యాంకు నిర్ణయంతో దరఖాస్తు, డాక్యుమెంటేషన్ (ఈ-సంతకం), రుణ మంజూరు మొదలైన ప్రక్రియలు సరళంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయి. ఇది తమ జవాబుదారీతనాన్ని, టెక్నాలజీ వినియోగంలో నిబద్ధతను సూచిస్తుందని బ్యాంకు మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Next Story