- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PNB: పీఎన్‌బీ పండుగ ఆఫర్.. తక్కువ వడ్డీకే కారు లోన్
ఈ ఆఫర్ అక్టోబర్-డిసెంబర్ మధ్య మాత్రమే చెల్లుబాటు అవుతుందని బ్యాంకు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ సందర్భంగా కార్లు కొనేవారి కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తక్కువ వడ్డీకే రుణాలివ్వనున్నట్టు ప్రకటించింది. ఏడాదికి కేవలం 7.85 శాతం నుంచి ప్రారంభమయ్యే కార్ లోన్ ఆఫర్ చేస్తూ బ్యాంకు వెల్లడించింది. దీంతో ఈ రేటు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే అత్యంత తక్కువ వడ్డీగా నిలిచింది. ఈ ఆఫర్ అక్టోబర్-డిసెంబర్ మధ్య మాత్రమే చెల్లుబాటు అవుతుందని బ్యాంకు తెలిపింది. అంతేకాకుండా కస్టమర్లకు సున్నా ప్రాసెసింగ్ ఫీజు, ఫ్లోటింగ్-రేటు రుణాలపై ముందస్తు చెల్లింపు లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీల మినహాయింపు, ఎక్కువ కాలం సౌకర్యంగా చెల్లించేలా ఏడేళ్ల వరకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుందని బ్యాంకు పేర్కొంది. ముఖ్యంగా పండుగ ఆఫర్ కింద తక్కువ వడ్డీ రేటుతో పాటు బ్యాంకు నో-ఫీ పాలసీ సౌకర్యం ఇవ్వడం వల్ల కస్టమర్లు రూ. వేలాది ఆదా చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నో-ఫీ పాలసీ అంటే వాహనం కొనే సమయంలో విధించే ప్రాసెసింగ్ ఫీజు వంటి అదనపు ఛార్జీలను తొలగించడం. ఇతర బ్యాంకుల్లో కార్లపై ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను గమనిస్తే.. యూకో బ్యాంకు అతి తక్కువగా 7.60 శాతం ప్రారంభ వడ్డీ ఆఫర్ చేస్తోంది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.70 శాతం నుంచి, ఎస్‌బీఐ 8.8 శాతం నుంచి వడ్డీ ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు 9.10 శాతం ప్రారంభ వడ్డీతో రుణాలిస్తున్నాయి.






