PM Kisan 19th Installment: రైతులకు బిగ్ అలర్ట్..రేపే పీఎం కిసాన్ నిధులు జమ..ఈ తప్పులు చేస్తే డబ్బులు జమ కావు

by Vennela |

PM Kisan 19th Installment: రైతులకు బిగ్ అలర్ట్. రేపు అనగా ఫిబ్రవరి 24వ తేదీన రైతులకు ప్రత్యేకమైన రోజు కానుంది.

PM Kisan 19th Installment: రైతులకు బిగ్ అలర్ట్..రేపే పీఎం కిసాన్ నిధులు జమ..ఈ తప్పులు చేస్తే డబ్బులు జమ కావు
X

దిశ, వెబ్‌డెస్క్: PM Kisan 19th Installment: రైతులకు బిగ్ అలర్ట్. రేపు అనగా ఫిబ్రవరి 24వ తేదీన రైతులకు ప్రత్యేకమైన రోజు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన 19వ (PM Kisan 19th Installment)విడత నగదు బదిలీ కానుండటంతో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్న రైతులు బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బు జమ అవుతుంది. చాలా మంది రైతుల వాయిదాలు కూడా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan 19th Installment)తో సంబంధం ఉన్న రైతులు 19వ విడత(PM Kisan 19th Installment)ను పొందబోతున్నారు. ఫిబ్రవరి 24న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ నగదును విడుదల చేయనున్నారు. బీహార్ లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా ఈ విడత నగదును బదిలీ చేయనున్నారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసారి 9.7కోట్ల మంది రైతులు 19వ విడత ప్రయోజనం పొందుతారు.

ప్రధాని మోదీ(pm modi) వాయిదాల డబ్బును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్(Direct Benefit Transfer) ద్వారా రైతుల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. అర్హత కలిగిన రైతులకు రూ. 2వేల ప్రయోజనం లభించనుంది. దీనికి ముందు ఇప్పటికే 18 విడతలు కిసాన్ నిధి(PM Kisan 19th Installment) యోజన విడుదల చేశారు. కానీ వీటిన్నింటి మధ్య కొంతమంది రైతులు 19వ విడత ప్రయోజనాన్ని పొందలేరు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. రైతులు 19వ విడత ప్రయోజనాన్ని పొందడానికి ముఖ్యకారణం..భూమి ధృవీకరణ పనిని పెండింగ్ లో ఉంచడం. సమ్మాన్ నిధి డబ్బు పొందాలంటే అర్హులైన రైతులు కచ్చితంగా డాక్యుమెంటేషన్, సకాలంలో ధ్రువీకరణను నిర్ధారించుకోవాలి.

ఈ కేవైసీ(e-kyc) పూర్తి చేయని రైతులు వాయిదా ప్రయోజనాలను కోల్పోతారు. వాయిదాల ప్రయోజనం పొందడానికి ఈ కేవైసీ(e-kyc) చేయడం తప్పనిసరి. మీరు ఈ పనిని మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రం నుంచి లేదా స్కీం అధికారిక వెబ్ సైట్ నుంచి పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ పనిని పూర్తి చేయనట్లయితే మీరు సమ్మాన్ నిధి ప్రయోజనాలు కోల్పోతారు.

ఆధార్ లింక్(Aadhar link) చేసే పనిని పూర్తి చేయని రైతుల అకౌంట్లో డబ్బు జమ కాదు . మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి మీ ఆధార్ కార్డు(Aadhar link)ను మీ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయాలి. దాంతోపాటు మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ఎంపికను కూడా ప్రారంభించాలి. ఎందుకంటే అది ప్రారంభించినట్లయితే మీరు వాయిదాల ప్రయోజనాలను కోల్పోతారు.

Next Story