- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పిక్సెల్ 10 సిరీస్‌పై గూగుల్ భారీ డిస్కౌంట్
కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ ఉత్పత్తులపై, గూగుల్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పిక్సెల్ 10తో పాటు పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అన్నిటిపైనా రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ 2ఏ, పిక్సెల్ బడ్స్ ప్రో 2 కొనుగోళ్లపై కూడా వినియోగదారులకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సోమవారం(డిసెంబర్ 15) నుంచే ప్రారంభమైందని, రెండు వారాల్లో ముగుస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ ఉత్పత్తులపై, గూగుల్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తోంది. అలాగే, ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
గూగుల్ అధికారిక వివరాల ప్రకారం, గూగుల్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా, గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ లావాదేవీలపై వినియోగదారులు రూ. 7,000 తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 10,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఈ సేల్ 2026, జనవరి 2 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
పిక్సెల్ ఫోన్‌లతో పాటు, గూగుల్ ఇయర్ ఎండ్ సేల్ పిక్సెల్ వాచ్, పిక్సెల్ బడ్స్ మోడళ్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ వాచ్ 3 రూ. 5 వేలు తక్కు ధరతో రూ. 22,915కే లభిస్తుంది. పిక్సెల్ ప్రో 2 ఉయర్‌బడ్స్ ధర సుమారు రూ. 3,000 తగ్గింపుతో రూ. 19,900కి లభిస్తోంది.






