- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phonepe: యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను ప్రారంభించిన ఫోన్‌పే
ప్రైమరీ యూజర్ల యూపీఐని ఉపయోగించి సెకండరీ యూజర్ ఎక్కడి నుంచైనా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకరి బ్యాంకు వివరాలు ఇవ్వకుండానే ఇంకొకరు ఆ వ్యక్తి యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం కలిగిన 'యూపీఐ సర్కిల్' ఫీచర్‌ను ప్రముఖ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్ ఫోన్‌పే గురువారం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూపీఐ అకౌంట్ ఉన్నవారు(వీరు ప్రైమరీ యూజర్‌గా ఉంటారు) తమ కుటుంబసభ్యులు, స్నేహితుల(సెకండరీ యూజర్)ను తమ యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ సర్కిల్‌లో యాడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ యూజర్ల యూపీఐని ఉపయోగించి సెకండరీ యూజర్ ఎక్కడి నుంచైనా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల సెకండరీ యూజర్లకు బ్యాంకు అకౌంట్ లేకపోయినా చెల్లింపులు పూర్తి చేసే వీలుంటుంది. దీనికోసం యూపీఐ అకౌంట్ ఉన్న ప్రైమరీ యూజర్ తన కుటుంబసభ్యులు, స్నేహితులు, తమ సొంతవారి యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్‌ను తన యూపీఐ సర్కిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండరీ యూజర్ యూపీఐ వాడి చేసే చెల్లింపులకు సంబంధించి పేమెంట్ రిక్వెస్ట్, చెల్లింపుల వివరాలు వంటివి ప్రైమరీ యూజర్ అనుమతితోనే జరుగుతాయి, అన్ని లావాదేవీలను ట్రాక్ చేసే వీలుంటుంది. ఫలితంగా చెల్లింపుల నియంత్రణ పూర్తిగా ప్రైమరీ యూజర్ వద్దే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సెకండరీ యూజర్‌ను తొలగించాలనుకుంటే యాక్సెస్‌ను ప్రైమరీ యూజర్ డీలింక్ చేయవచ్చు. గరిష్ఠంగా యూపీఐ సర్కిల్‌లో ఐదుగురిని చేర్చుకోవచ్చు. ఈ సదుపాయం కోసం యూజర్లు తమ ఫోన్‌పేలో 'మేనేజ్ పేమెంట్స్ ' విభాగంలో 'యూపీఐ సర్కిల్ ' లో సెకండరీ కాంటాక్ట్స్ ఎంచుకోవాలి. అందులో ఇన్వైట్ అ రిక్వెస్టర్ సెలెక్ట్ చేసి, సెకండరీ యూజర్‌కి సంబంధించి యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ రిక్వెస్ట్ పంపాలి. దాన్ని సెకండరీ యూజర్ యాక్సెప్ట్ చేయడం ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే గూగుల్‌పే అందిస్తోంది.






